: రాజధాని ప్రాంతంలో ఉచితంగా భవంతి నిర్మించి ఇస్తాం ... ముందుకు వచ్చిన జనచైతన్య గ్రూప్


నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ భవంతి నిర్మించేందుకు జనచైతన్య గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును గ్రూప్ ఛైర్మన్ మాదాల చైతన్య కలిశారు. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవంతిని ఉచితంగా నిర్మించి ఇస్తామని సీఎంకు తెలిపారు. అది కూడా తన తల్లి శకుంతల పేరిట భవనం నిర్మిస్తామని చైతన్య వివరించారు. ఇందుకు సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు, జనచైతన్య గ్రూప్ ను అభినందించారు.

  • Loading...

More Telugu News