: వరంగల్ ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ప్రారంభం: చాడ
త్వరలో జరగనున్న వరంగల్ ఉప ఎన్నికతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ఎన్నికలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ వచ్చే నెల 2వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు.