: 26వ తేదీ ఎంత డేంజరో తెలుసా?... ప్రపంచ ఉత్పాతాల్లో అత్యధికం ఆ రోజునే, సాక్ష్యాలివే!


ప్రపంచంలో సంభవిస్తున్న ప్రకృతి వైపరిత్యాలకు, 26వ తారీకుకూ సంబంధం ఉందా? జరుగుతున్న పరిణామాలు, మానవాళికి కలుగుతున్న నష్టం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలని చెప్పేవారు ఎంతమందున్నా, ప్రపంచ చరిత్రలో 26వ తేదీన జరిగిన మానవ నష్టం అంతాఇంతా కాదు. ముంబైపై ఉగ్రదాడి నుంచి, నిన్నటి ఆఫ్గన్ భూకంపం దాకా, 2001లో గుజరాత్ భూకంపం నుంచి 3 లక్షల మందిని పొట్టన బెట్టుకున్న 2004 సునామీ దాకా అన్నీ 26వ తేదీన వచ్చినవే. ఇటీవల నేపాల్ లో 10 వేల మందిని పొట్టన బెట్టుకున్న భూకంపం సైతం ఏప్రిల్ లో 26వ తారీఖునే వచ్చింది. ఇవేనా?...1700 సంవత్సరంలో జనవరి 26న నార్త్ అమెరికాలో భూకంపం, 1883లో ఆగస్టు 26న అగ్నిపర్వతం బద్దలు, 1926 జూన్ 26న లో రోడ్స్ భూకంపం 26న ప్రకృతి ప్రకోపిస్తుందనడానికి నిదర్శనాలు. ఇవి మాత్రమే కాదు, 1939 డిసెంబరులో టర్కీ భూకంపం, 1976 జూలైలో చైనా భూకంపం, 2003 డిసెంబరులో ఇరాన్ భూకంపం, 2010 జూన్ లో తాసిక్, జలైలో తైవాన్ భూకంపాలు, అక్టోబరులో మెంట్వా సునామీలు సైతం 26వ తేదీనే వచ్చాయి. ఇక 2005లో జూలై 26న మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ముంబైని భారీ వరదలు చుట్టుముట్టగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు తాజాగా నిన్న అక్టోబర్ 26న హిందుకుష్ పర్వతాలు కేంద్రంగా భారీ భూకంపం సంభవించి 300 మందిని బలిగొంది. దీంతో ప్రపంచ చరిత్రలో 26వ తేదీకి, ఉత్పాతాలకూ సంబంధముందన్న వాదన మరింతగా బలపడినట్లయింది.

  • Loading...

More Telugu News