: జోడేఘాట్ లో కొమురం భీమ్ వర్థంతి కార్యక్రమాలు


ఆదివాసీ నేత, పోరాటయోధుడు కొమురం భీం 75వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కెరామరి మండలంలోని జోడేఘాట్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీం అమర్ హై అనే నినాదాలతో జోడేఘాట్ మార్మోగుతోంది. కొమురం భీం సమాధి వద్ద ఆయన వంశీకులు ప్రత్యేక పూజలు చేసి నాలుగు రకాల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వం తరఫున ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.ఇ.కరుణన్ పూజలు నిర్వహించి కొమురం భీంకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, ఎంపీ బాల్క సుమన్, ఆదివాసీలు, గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అమరవీరుడు కొమురం భీం చేసిన ఉద్యమం సాహసోపేతమైందంటూ ప్రశంసించారు.

  • Loading...

More Telugu News