: సీఎం కార్యాలయంలోని ఫైళ్లన్నీ లోకేశ్ కనుసన్నల్లో కదులుతున్నాయి: రఘువీరా


ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీతాపతి అభీష్ట అనే వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా ఓఎస్డీగా నియమించారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. కేవలం చంద్రబాబు కుమారుడు లోకేశ్ కు స్నేహితుడు కావడమే అభీష్ట అర్హత అని మండిపడ్డారు. చంద్రబాబు కార్యాలయంలోని ఫైళ్లన్నీ లోకేశ్ కనుసన్నల్లోనే కదులుతున్నాయని ఆరోపించారు. విశాఖలో హుదూద్ తుపాను సంభవించిన సమయంలో రెండు లక్షల మందికి రేషన్ కూపన్లు అందించారని... అయితే, అవన్నీ టీడీపీ నేతలు, కార్యకర్తలకే అందాయని ఆరోపించారు. ఈ రోజు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రఘువీరా పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News