: క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్
భారత క్రికెట్ జట్టులో లెగ్ స్పిన్నర్ గా సేవలందిస్తున్న అమిత్ మిశ్రాను ఈ మధ్యాహ్నం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లో మహిళను లైంగికంగా వేధించినట్టు ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల భారత జట్టు బెంగళూరులో శిక్షణ శిబిరంలో పాల్గొన్న సమయంలో అమిత్ కు పరిచయస్తురాలైన ఓ మహిళా నిర్మాత ఆయనుంటున్న హోటల్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో తనను అమిత్ వేధించాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసేదాకా ఆగి, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను కేసును ఉపసంహరించుకుంటున్నానని తొలుత వెల్లడించిన సదరు యువతి, తదుపరి అటువంటిదేమీ లేదని చెప్పింది. అమిత్ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.