: అమరావతిపై కానిస్టేబుల్ మమకారం... నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన వైనం


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై ప్రజాభిమానం నానాటికీ పెరిగిపోతోంది. అమరావతి శంకుస్థాపన రోజున పుట్టిన పిల్లలకు అమరావతి పేరు పెట్టుకుంటే, రూ.10 వేల బహుమతి అందజేస్తానని ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ తన హామీని అమలు చేశారు. ఇద్దరు చిన్నారులకు రూ.10 చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. అమెరికాలో ఉంటున్న తెలుగు డెంటల్ డాక్టర్ తన కారు నెంబర్ ప్లేట్ పై అమరావతి అనే పేరును రాయించుకున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఓ కానిస్టేబుల్ తన నెల వేతనాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందజేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసిన పెదకాకాని కానిస్టేబుల్ సాంబశివరావు తన నెల వేతనాన్ని అమరావతికి విరాళంగా అందజేశారు. ఏకంగా నెల వేతనాన్ని అందజేసిన సాంబశివరావును చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

  • Loading...

More Telugu News