: చిరంజీవి పేరిట బంగారు నాణేలు రూపొందించిన 'కానా'
సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేరిట 'చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా' (కానా) బంగారు నాణేలు రూపొందించారు. ఈ మేరకు హైదరాబాద్ లో చిరును కలసిన కానా సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగానే బంగారు నాణేలను విడుదల చేశారు. అంతేగాక చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందిన చిరు... తెలుగు సహా పలు భాషల్లో సాధించిన విజయాలు, రికార్డులు, ఆయన సినీ జీవిత విశేషాలను ఓ సంచిక రూపంలో ప్రత్యేకంగా చిరంజీవికి అందజేశారు.