: పోస్టింగ్ కావాలంటే విజయవాడ వెళ్లాల్సిందే: అధికారుల ఆదేశాలతో తలపట్టుకుంటున్న ఉద్యోగులు
ఇటీవల ఏపీకి కేటాయించిన అధికారులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు. కమలనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్రాకు కేటాయించబడ్డ ఉద్యోగులు, తమ ఉద్యోగమెక్కడని ప్రశ్నిస్తుంటే, సీఆర్డీయే, విజయవాడకు వెళ్లాల్సిందేనని ఉన్నతాధికారులు బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో, ఉద్యోగులు తల పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోస్టింగ్ కావాలంటే విజయవాడ వెళ్లాలని చెల్లింపులు, ఖాతాల విభాగం అధికారులకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ తెలిపారు. ఇక ఇదే మార్గాన్ని ఇతర శాఖలూ పాటిస్తున్నాయి. ఏపీకి సంబంధించి హైదరాబాద్ లో ఖాళీలు లేవని వీరంటున్నారు. దీంతో ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించబడ్డ వారంతా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి.