: స్పైస్ జెట్ నుంచి దీపావళి ఆఫర్... తక్కువ ధరలకు స్వదేశీ, విదేశీ టికెట్లు
దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు దీపావళి ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరలకు 3 లక్షల టికెట్లను అమ్మకానికి పెట్టింది. స్వదేశీ ప్రయాణాలకు రూ.749 నుంచి (పన్నులు కాకుండా, విదేశాలకు అయితే రూ.3,999 నుంచి టికెట్లను అమ్మకానికి ఉంచింది. ఇవాళ నుంచి ఈ నెల 29 వరకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్న స్పైస్ జెట్... ముందుగా బుక్ చేసుకున్న వారికే టికెట్లు దక్కుతాయని తెలిపింది. ఆఫర్ కింద ఢిల్లీ- అమృత్ సర్, అహ్మదాబాద్-ముంబై నగరాలకు వెళ్లవచ్చు. తమ ఆఫర్ కు అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 9 నెలల్లోగా ఆఫర్ టికెట్ కింద ప్రయాణించాల్సి ఉంటుంది.