: రాజధాని ప్రాంతాల్లో పొలాలు తగలబడటం వెనుక కుట్ర కోణం కనిపిస్తోంది: చినరాజప్ప
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మల్కాపురంలో చెరకు తోట తగలబడటంపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అనుమానం వ్యక్తం చేశారు. రాజధాని ప్రకటన వచ్చాక అమరావతి ప్రాంతంలో పొలాలు తగలబడ్డాయన్నారు. మళ్లీ శంకుస్థాపన తరువాత పొలాలు తగలబడ్డాయని, వాటి వెనుక కుట్ర కోణం కనిపిస్తోందని అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ ఉన్నత విచారణ జరుపుతోందని చెప్పారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో అలజడి సృష్టించే వారిని సహించమని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని తెలిపారు.