: రుణ పరిమితి పెంచి ఆదుకోండి ... అరుణ్ జైట్లీకి కేసీఆర్ విజ్ఞప్తి
ఆవిర్భావంతోనే ధనిక రాష్ట్ర హోదాతో ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ ఏడాదిన్నర తిరక్కముందే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటోంది. నిన్నటిదాకా లేనిపోని గాంభీర్యం ప్రదర్శించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంతో రాజీకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్, కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రుణ పరిమితి పెంచాలని ఆయన జైట్లీకి మొరపెట్టుకున్నారు. అంతేకాక కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విడుదలపైనా ఆయన లోతుగా చర్చించినట్లు సమాచారం. పలు పద్దుల కింద ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు నిధులు మంజూరు కావడం లేదని కూడా కేసీఆర్ చిట్టా విప్పినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వాదనను సావధానంగా విన్న జైట్లీ, రాష్ట్రానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.