: హీరో అజిత్ కు హార్ట్ అటాక్... సోషల్ మీడియాలో పుకార్ల షికారు


తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోల అభిమానుల అభిమానం హద్దు మీరుతోంది. ఇంతకాలం టాప్ హీరోల అభిమానులు పరస్పర విమర్శలతోనే సరిపెట్టుకునేవారు. కానీ, తాజాగా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు తెగిస్తున్నారు. తాజాగా, కోలీవుడ్ లో టాప్ ప్లేస్ కు పోటీపడుతున్న హీరో అజిత్ కు ఇలాంటి అనుభవమే మిగిలింది. ఇతర హీరోల ఫ్యాన్స్ అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఆ అకౌంట్ ద్వార్ అజిత్ కు హార్ట్ అటాక్ వచ్చిందంటూ ప్రచారం చేశారు. ఇది అజిత్ కు సంబంధించిన వార్త కావడంతో క్షణాల్లో ఎంతో మందికి షేర్ అయిపోయింది. దీంతో, సదరు అకౌంట్ తనది కాదని... అజిత్ కు హార్ట్ అటాక్ రావడం కావాలని పుట్టించిన పుకారు అని మేనేజర్ సురేష్ చంద్ర వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు, దీనిపై సైబర్ క్రైం పోలీసులకు కూడా సురేష్ ఫిర్యాదు చేశారు. మరోవైపు, తనకి ఏమీ కాలేదని చెబుతూ, తాజా ఫొటోలను సోషల్ మీడియాలో అజిత్ పోస్ట్ చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News