: మెట్రో అలైన్ మెంట్ మార్చాలంటూ సుల్తాన్ బజార్ వ్యాపారుల బంద్
హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ వ్యాపారుల సంఘం జేఏసీ దుకాణాలు మూసివేసి బంద్ చేపట్టింది. బడీచౌడీ మార్కెట్ మీదుగా మెట్రో కారిడార్-2 మార్గాన్ని ఏర్పాటు చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది. అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ తమకు మద్దతిచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మాట మారుస్తున్నారని మండిపడుతున్నారు. మెట్రో నుంచి కేవలం సుల్తాన్ బజార్ మార్కెట్ నే మినహాయించే విధంగా మార్గాన్ని మళ్లిస్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాపారులు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. మెట్రో కారిడార్ మార్గాన్ని మళ్లించేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు.