: నవంబర్ లో దేశీయ మార్కెట్ లోకి మ్యాగీ నూడిల్స్
బాంబే హైకోర్టు నిషేధం ఎత్తివేయడంతో నెస్లే సంస్థ మ్యాగీ నూడిల్స్ భారత మార్కెట్ లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నవంబర్ లో నూడిల్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందుకోసం మళ్లీ కొత్తగా తయారీ చేపట్టామని, పరీక్షల అనంతరం అమ్మకాలు మొదలుపెడతామని చెప్పారు. మ్యాగీలో మోతాదుకి మించి సీసం వంటి పదార్థాలు ఉన్నాయన్న కారణంతో ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అమ్మకాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే పలుమార్లు పిటిషన్ లు పెట్టుకున్నాక బాంబే హైకోర్టు అనుమతించింది. మరోసారి పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది.