: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సౌదీ యువరాజు
లెబనాన్ లోని బీరూట్ అంతర్జాతీయ విమానాశ్రయ చరిత్రలో అత్యధిక మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసు నమోదుకాగా, సౌదీ యువరాజు అబ్దుల్ మోసెన్ బిన్ వాలిద్ బిన్ అబ్దులజీజ్ సహా ఐదుగురు పట్టుబడటం సంచలనం సృష్టించింది. దాదాపు రెండు టన్నుల కొకైన్, క్యాప్టగాన్ టాబ్లెట్లను వీరు ప్రైవేటు విమానం ద్వారా సౌదీ అరేబియాకు స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. కాప్టగాన్ పై మిడిల్ ఈస్ట్ దేశాల్లో నిషేధం అమలవుతోంది. సిరియా ఫైటర్లు వీటిని వాడుతారని సమాచారం. మాదక ద్రవ్యాల రవాణాను తీవ్ర నేరంగా పరిగణించి పట్టుబడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించే సౌదీ, యువరాజు విషయంలో ఏం చేస్తుందో చూడాలి!