: అనుష్క బాటలో రితిక... వాంఖడేలో రోహిత్ ప్రియురాలు సందడి
టీమిండియా ఎక్కడికెళ్లినా, జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ అక్కడికెళ్లిపోతోంది. జట్టు గెలిస్తే ఫరవాలేదు కాని, ఓడితే మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ అమాంతం ఆమెపై దాడికి దిగుతున్నారు. తాజాగా ఇదే పరిస్థితి టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మకు కూడా ఎదురయ్యేలానే ఉంది. ఎందుకంటే... అతడి ప్రియురాలు రితిక మొన్నటి మ్యాచ్ లో వాంఖడే స్టేడియం స్టాండ్స్ లో తళుక్కుమంది. రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చప్పట్లతో అతడిని ఉత్సాహపరచిన రితిక, బ్యాటింగ్ లో కేవలం 16 పరుగులకే రోహిత్ ఔటవడంతో కిమ్మనకుండా కూర్చుండిపోయింది.