: చంద్రబాబుతో రేవంత్ భేటీ... ‘ఏకాంత’ సమావేశంపై ఆసక్తికర చర్చ


టీ టీడీపీ నేతలు పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో నేడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ, అభ్యర్థి ఖరారుపై చర్చించేందుకు ఇప్పటికే టీ టీడీపీ ముఖ్యులంతా విజయవాడ చేరుకున్నారు. ఇదిలా ఉంటే, టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డి పార్టీ నేతల కంటే ముందుగానే చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నేటి ఉదయం 9.45 నిమిషాలకు ఈ భేటీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. వరంగల్ ఉప ఎన్నికపై చర్చ సందర్భంగా మొన్న ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అసలు సమాచారం ఇవ్వడమే లేదని మొన్నటి భేటీలో ఎర్రబెల్లితో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయితే ఎర్రబెల్లి కూడా రేవంత్ కు కాస్త గట్టిగానే బదులిచ్చారని వదంతులు వినిపించాయి. ఎర్రబెల్లి వ్యాఖ్యలతో మనసు నొచ్చుకున్న రేవంత్ రెడ్డి, సదరు అంశాన్ని నేటి భేటీలో చంద్రబాబు ముందు ఉంచనున్నట్లు సమాచారం. పార్టీ నేతలందరితో భేటీ కంటే ముందే చంద్రబాబు రేవంత్ తో ఏకాంతంగా భేటీ కానున్న విషయం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News