: ఎర్రబెల్లి, రేవంత్ ల మధ్య గొడవా?... అలాంటిదేమీ లేదన్న రావుల


వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో మిత్రపక్షం బీజేపీ నుంచి సీటు లాక్కోవడంతో పాటు అభ్యర్థిని ఖరారు చేసేందుకంటూ మొన్న జరిగిన టీ టీడీపీ ముఖ్యుల భేటీలో టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్ రెడ్డిల మధ్య గొడవ జరిగిందన్న విషయంపై ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. వరంగల్ ఉప ఎన్నికల బరిపై భేటీలో భాగంగా ఏదో చెప్పడానికి సిద్ధమైన రేవంత్ ను ‘ఐటం సాంగ్ లా వచ్చిపోతావు’ అంటూ ఎర్రబెల్లి విరుచుకుపడ్డారని పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఎర్రబెల్లి, రేవంత్ లు ఇద్దరూ పరిణతి చెందిన నేతలని, వారిద్దరూ అసలు గొడవే పడలేదని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి చెప్పారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రావుల ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ఆ ఇద్దరు నేతలు పరిణతి చెందిన నాయకులు. పార్టీ కోసం వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అది కొట్లాట కాదు. ఆ తర్వాత కూడా గోల్కొండ హోటల్లో జరిగిన సమావేశానికి అందరం కలిసే వెళ్లాం’’ అని రావుల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News