: నడి రోడ్డుపై భోజనం చేసిన వీరేంద్ర సెహ్వాగ్... భూకంపమే కారణమని ట్వీట్స్


భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నిన్న మధ్యాహ్నం ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లలో సంభవించిన పెను భూకంపం ఉత్తర భారతాన్ని కూడా వణికించింది. పెద్దగా ప్రాణనష్టం లేకున్నా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు కదిలిపోయాయి. దీంతో ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఢిల్లీకి చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా భూకంప ప్రభావం కారణంగా వణికిపోయాడు. ఉన్నపళంగా ఇల్లు కదిలిపోవడంతో భోజనం చేస్తున్నవాడు అలాగే బయటకు వచ్చేశాడు. నడి రోడ్డుపైనే భోజనం ముగించాడు. ఇదే విషయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘‘భూకంపం వణికిస్తోంది బ్రదర్. అందుకే బయట కూర్చొని లంచ్ చేస్తున్నాను’’ అని వీరూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News