: రేపు భద్రాచలంలో శబరి స్మృతి యాత్ర


ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో మంగళవారం శబరిస్మృతి యాత్ర నిర్వహించనున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం ఈ వేడుకను నిర్వహిస్తారు. కొమ్ము కోలాట నృత్యాలతో తొలుత రామాలయం చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తారు. అనంతరం దేవాలయానికి చేరుకొని స్వామివారికి పూలు, ఫలాలతో ఫల, పుష్పార్చన చేస్తారు. అనంతరం చిత్రకూట మండపంలో స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News