: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం..మరో ప్రమాదంలో 15 మందికి గాయాలు
కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం సోమాలపల్లి వద్ద జరిగింది. మృతులను అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రంగానాయుడు, సుశీలగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా అట్లూరు మండలంలోని ఎస్.వెంకటాపురం వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వ్యాన్ ఢీ కొట్టిన సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడపలోని రిమ్స్ కు తరలించి వైద్య సేవలందిస్తున్నారు. బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో వ్యాన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.