: సందీప్ కిషన్ సినిమా చూస్తున్న క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా తెలుగు సినీ నటుడు సందీప్ కిషన్ సినిమా చూస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయం చెప్పడంతో ఈ చిత్రబృందం పండగ చేసుకుంటోంది. తెలుగు రాని బ్రయాన్ లారా సందీప్ కిషన్ సినిమా చూడడమేంటనే అనుమానం వచ్చిందా? 'సైలెంట్ మెలడీ' అనే మూకీ లఘు చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినీ నటుడు సందీప్ కిషన్ నిర్మించాడు. ఈ లఘు చిత్రంలో ప్రాచీ థాకర్, కునాల్ కౌశిక్ నటించారు. ఓ మామూలు యువకుడికి ...మూగ, బధిర యువతికి మధ్య జరిగిన ప్రేమ కధే 'సైలెంట్ మెలడీ'. ప్రస్తుతం ఇంట్లో కూర్చుని, యూ ట్యూబ్ లో ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నట్టు లారా ట్వీట్ చేశాడు.