: తండ్రితో సెల్ఫీ దిగిన రజనీకాంత్ కూతురు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తన తండ్రితో కలిసి ఓ సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీని ఆమె ట్విట్టర్ లో పోస్టు చేసింది. 'కబాలీ' చిత్రం షూటింగ్ నిమిత్తం రజనీకాంత్ ఈరోజు మలేషియా వెళ్లారు. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఐశ్వర్య ఈ సెల్ఫీ దిగారు. కాగా, పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కబాలీ'. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో డాన్ లుక్ తో ఉన్న రజనీ పోస్టర్లు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.