: రాత్రి 9 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాత్రి 9 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకుగాను ఆయన అక్కడికి వెళుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక, ఉపరితల రవాణా మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. రేపు ఉదయం 11.45 గంటలకు అరుణ్ జైట్లీతోనూ, మధ్యాహ్నం 2.30 గంటలకు నితిన్ గడ్కరీతోను ఆయన సమావేశమవుతారు. రేపు సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. కాగా, డిసెంబర్ లో నిర్వహించతలపెట్టిన చండీయాగానికి ప్రధాని మోదీని కేసీఆర్ ఆహ్వానించనున్నట్లు సమాచారం.