: ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన దసరా ఆఫర్ ఇదేనా?: తమ్మినేని సీతారాం


రాష్ట్ర ప్రజలకు దసరా రోజున రంగుల కల చూపించి, వెంటనే ఛార్జీల వాత పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని అన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఈ రోజు వైకాపా చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. స్వయంగా ఓ టీడీపీ ఎమ్మెల్యే లంచం తీసుకుంటానని చెబుతున్నారని... దీన్ని బట్టి రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అవినీతి శాఖ మంత్రిగా నారా లోకేష్ ను నియమించవచ్చని అన్నారు. అమరావతి శంకుస్థాపనకు అయిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News