: ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం: విశాల్


నడిగర్ సంఘం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని ప్రముఖ నటుడు విశాల్ తెలిపాడు. తాజాగా జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ వర్గాన్ని ఓడించి విశాల్ వర్గం విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయం సాధించిన అనంతరం తొలిసారి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని విశాల్ వర్గం తెలిపింది. తమపై నమ్మకంతో గెలిపించిన వారందరికీ సంఘం అధ్యక్షుడు నాజర్ ధన్యవాదాలు తెలిపారు. నడిగర్ సంఘ భవనం గురించిన ఒప్పందాన్ని రద్దు చేసినట్టు శరత్ కుమార్ తెలిపారని, దానిపై ఆధారాలు చేతికందగానే సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే భవన నిర్మాణానికి సరిపడా నిధులు లేని కారణంగా సినీ నటులంతా కలిసి ఓ సినిమాలో నటించి, క్రికెట్ మ్యాచ్ లు, మ్యూజికల్ నైట్స్ నిర్వహించి నిధులు సమకూరుస్తామని విశాల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News