: ప్రత్యేక హోదాపై బాలకృష్ణ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం: కారెం శివాజీ
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకుందని, ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాల మహానాడు నేత కారెం శివాజీ స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బాలయ్య లాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా హోదాపై గళం విప్పాలని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బీజేపీ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని ప్రత్యేక హోదా సాధనా సమితి ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. నవంబర్ 2న తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.