: దక్షిణ భారత నటీనటుల సంఘానికి హీరో సూర్య విరాళం


నడిగర్ సంఘానికి హీరో సూర్య రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు. దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన కార్యవర్గం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను నూతన కార్యవర్గం ప్రస్తావించింది. ముఖ్యంగా నడిగర్ సంఘం భవన నిర్మాణానికి నిధులు చాలా అవసరమని పేర్కొంది. ప్రస్తుతం 29 లక్షల 37 వేల 17 రూపాయల 84 పైసలతో పాటు రూ.87 లక్షల 75 వేలు బ్యాంక్ డిపాజిట్ మాత్రమే సంఘానికి ఉందన్నారు. స్టార్ క్రికెట్, స్టార్ నైట్లు నిర్వహించడం, యువ నటులందరూ కలిసి ఒక చిత్రంలో నటించడం ద్వారా భవన నిర్మాణానికి నిధులు రాబడతామని సంఘం కార్యదర్శి విశాల్ వెల్లడించారు. అయితే, ఈ సమావేశం జరుగుతుండగానే నటుడు సూర్య తన విరాళాన్ని ప్రకటించాడు.

  • Loading...

More Telugu News