: ఆఫ్గన్ లో మరో భూకంపం... 'afghanistan earthquake' పేరిట ట్విట్టర్ ఖాతా... వెల్లువెత్తుతున్న చిత్రాలు!


ఈ మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసిన తరువాత, ఆప్గనిస్థాన్ లో మరో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదు కాగా, ఈ ప్రకంపనల ప్రభావం నేపాల్ లో సైతం కనిపించింది. కాగా, 'afghanistan earthquake' పేరిట ట్విట్టర్ లో ఓ ఖాతాను ప్రారంభించగా, ప్రజలు తమ ప్రాంతంలో తీసిన చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు. ఆఫ్గన్ లోని పంజ్ షీర్ ప్రావిన్స్ లో కుప్పకూలిన భవనాలు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. కాబూల్ లో పలు భవనాలు నేలమట్టమైనట్టు బీబీసీ కొన్ని చిత్రాలను విడుదల చేసింది. భూకంపం ధాటికి కొండ చరియలు విరిగి ఓ గ్రామంపై పడుతున్న దృశ్యాన్ని 'ది గార్డియన్' విడుదల చేసింది.

  • Loading...

More Telugu News