: పంటలను తగలబెట్టడం మా సంస్కృతి కాదు: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతి ప్రాంత రైతులు నేడు విజయవాడలో కలిశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా రైతులు కితాబిచ్చారు. రాజధాని నిర్మాణంలో స్థానిక రైతులు, కూలీలు, యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానిని త్వరగా నిర్మించుకుందామని రైతులతో చెప్పారు. రాజకీయాలకు తావులేకుండా, రైతులంతా స్వచ్ఛందంగా భూములను ఇస్తే... కొందరు దాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. శంకుస్థాపన కోసం పంటలను నాశనం చేశారని ఆరోపిస్తున్నారని... పంటను తగలబెట్టే సంస్కృతి తమది కాదంటూ పరోక్షంగా జగన్ పై ధ్వజమెత్తారు.