: నా పెళ్లిపై వస్తున్నవన్నీ పుకార్లే: అసిన్


దక్షిణాదిన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అసిన్, ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి, అక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇదే సమయంలో, మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ నవంబర్ 26న ఢిల్లీలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన అసిన్... ఈ వార్తలను నమ్మకండని చెప్పింది. ఇదంతా కేవలం మీడియానే క్రియేట్ చేస్తోందని... తామింకా ముహూర్తాలు కూడా పెట్టుకోలేదని స్పష్టం చేసింది. తన ప్రాజెక్టులు ఈ ఏడాది చివరకు పూర్తవుతాయని... ఆ తర్వాతే తమ పెళ్లి జరుగుతుందని చెప్పింది. పెళ్లి తేదీని తాను చెప్పేంత వరకు ఓపిక పట్టాలని అభిమానులను కోరింది. మరోవైపు, అసిన్ నేడు 31వ పడిలోకి అడుగుపెట్టింది.

  • Loading...

More Telugu News