: కడప, అనంత టీడీపీ బాధ్యతలు కర్నూలు యువనేతకు... మిగిలిన జిల్లాలకూ ఇంచార్జీల నియామకం!


ఏపీలో ప్రభుత్వ పాలనను ఓ గాడిలో పెట్టిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాజాగా పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. ఇటీవలే పార్టీకి జాతీయ కమిటీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కమిటీలను నియమించిన చంద్రబాబు ఆయా రాష్ట్రాల కమిటీలకు జంబో కార్యవర్గాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వారిని పార్టీ జిల్లా ఇంచార్జీలుగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత దివంగత బీవీ మోహన్ రెడ్డి కుమారుడు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి కడప, అనంతపురం జిల్లాల బాధ్యతలు అప్పగించారు. తండ్రి మరణంతో తొలిసారిగా బరిలోకి దిగి విజయం సాధించిన జయనాగేశ్వరరెడ్డి జిల్లాలో కీలక నేతగా ఎదుగుతున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపతో పాటు రాయలసీమలో మరో కీలక జిల్లా అనంతపురం బాధ్యతలను కూడా ఆయనకు చంద్రబాబు అప్పగించారు. ఇక మిగిలిన జిల్లాలకూ చంద్రబాబు ఇంచార్జీలను నియమించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి కడప, అనంతపురం... బీవీ జయనాగేశ్వరరెడ్డి కర్నూలు, చిత్తూరు... వర్ల రామయ్య గుంటూరు, ప్రకాశం, నెల్లూరు... గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి... రెడ్డి సుబ్రహ్మణ్యం కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖ... రామానాయుడు

  • Loading...

More Telugu News