: అమరావతి ఖర్చుపై అంబటి లెక్క ఇది
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు అయిన ఖర్చుల వివరాలను వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. ఆయన లెక్కల ప్రకారం, శంకుస్థాపనకు వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేసింది. కార్యక్రమానికి విచ్చేసిన వారి ప్రయాణ ఖర్చు రూ. 199 కోట్లు, బసకు రూ. 78 కోట్లు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కు రూ. 10 కోట్లు, సభకు రూ. 8 కోట్లు, పోలీస్ శాఖకు రూ. 10 కోట్లు, ప్రచారం చేయడానికి రూ. 30 కోట్ల ఖర్చు చేశారని ఆయన తెలిపారు. మరో విషయం ఏమిటంటే, ఖర్చులో సగ భాగం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుయాయుల జేబుల్లోకి వెళ్లిందని అంబటి ఆరోపించారు. అమరావతి ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.