: ‘కోటా’ ఇస్తే ఓకే...లేదంటే మతం మార్చుకొంటాం!: గుజరాత్ సర్కారుకు పటేళ్ల హెచ్చరిక
గుజరాత్ లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం పాటిదార్ అనామత్ ఆందోళన సమితి గొడుగు కింద యువ సంచలనం హార్దిక్ పటేల్ చేపట్టిన ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే హార్దిక్ పటేల్ ను నిలువరించిన గుజరాత్ ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేసిన యత్నాలు దాదాపుగా ఫలించాయనే చెప్పాలి. అయితే ప్రభుత్వం ఊహించని విధంగా హార్దిక్ అనుచరులు కొత్త వాదనను ప్రభుత్వం ముందు పెట్టారు. ‘‘మా డిమాండ్ మేరకు ఓబీసీ రిజర్వేషన్లను అందించండి. లేకపోతే రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడానికి కూడా మేం సిద్ధమే’’ అని వారు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వారు గుజరాత్ నగరం సూరత్ లో ఇటీవల పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేేస్తోంది.