: బీజేపీ నాయకుడి కుమారుడి కిడ్నాప్
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన బీజేపీ నేత పొన్న వెంకటరమణ కుమారుడు శబరీష్ (15)ను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి కిడ్నాప్ చేశారు. శబరీష్ చైతన్య టెక్నో స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. నిన్న రాత్రి విశాఖ ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న శబరీష్ ను కిడ్నాప్ చేశారు. ఇద్దరు వ్యక్తులు బెదిరించి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంకటరమణకు తెలియజేశారు. వెంటనే ఆయన పాతబస్తీలోని శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలు వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.