: రూ. 500 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన మరో స్మార్ట్ ఫోన్ సంస్థ
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ 'లావా' ఆంధ్రప్రదేశ్ లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంటు పెట్టాలని నిర్ణయించింది. మొత్తం రూ. 500 కోట్ల పెట్టుబడితో, తిరుపతి సమీపంలో 20 ఎకరాల్లో ఈ సెంటర్ ఉంటుందని సంస్థ ఉత్పత్తి విభాగం అంతర్జాతీయ చీఫ్ సంజీవ్ అగర్వాల్ వివరించారు. ఈ కేంద్రం ద్వారా దాదాపు 12 వేల మందికి ప్రత్యక్షంగా, మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్లాంటు నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తవుతుందని, 2017లో ఇక్కడ సెల్ ఫోన్ల తయారీ ప్రారంభమవుతుందని సంజీవ్ తెలియజేశారు.