: బట్టతలకు మందు కనుగొన్న కొలంబియా శాస్త్రవేత్తలు, ఓకే చెప్పిన యూఎస్ ఎఫ్డీఏ


స్త్రీ, పురుషులను ఎంతో ఇబ్బందిపెట్టి ఆత్మన్యూనతా భావాన్ని పెంచే బట్టతలను పోగొట్టే సరికొత్త ఔషధాన్ని కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరి ఆవిష్కరణకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) సైతం ఆమోదం తెలిపింది. ఔషధం అభివృద్ధికి పచ్చజెండా ఊపింది. కురుల కుదుళ్లలో జానస్ కైనేస్ వర్గానికి చెందిన ఎంజైములను నిరోధించడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుందని వర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. రుక్సోలిటినిబ్, టోఫాసిటినిబ్ ఔషధాలు జానస్ కైనేస్ కు నిరోధకాలని గుర్తించారు. మగవారికి వచ్చే బట్టతలతో పాటు పలురకాల శిరోజాల సమస్యలకు ఈ మందు చక్కటి ఫలితాలను ఇచ్చిందని శాస్త్రవేత్తలు వివరించారు.

  • Loading...

More Telugu News