: గిరిజన హక్కుల పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే జి.దేముడు కన్నుమూత
ఏపీ గిరిజన సమాఖ్య అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జి.దేముడు ఇక లేరు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన విశాఖలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న జి.దేముడు విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గం నుంచి సీపీఐ పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ ఆయన గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స కోసం కేజీహెచ్ లో చేరారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆయన భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం శరభన్నపాలెంకు తరలించారు.