: గల్లా జయదేవ్ ప్రధానికి క్షమాపణలు చెప్పాల్సిందే... సోము వీర్రాజు డిమాండ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మిత్రపక్షం టీడీపీ, ఆ పార్టీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని ప్రధాని ఎప్పుడూ చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. అమరావతి వేదికపై మోదీ చేసిన ప్రసంగం తనను నిరాశపరిచిందని గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలను వీర్రాజు తప్పుబట్టారు. ప్రధాని ప్రసంగంపై గల్లా జయదేవ్ వ్యాఖ్యలు సరికాదని తేల్చిచెప్పారు. గల్లా జయదేవ్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడమే కాక ప్రధానికి క్షమాపణలు చెప్పాలని కూడా వీర్రాజు డిమాండ్ చేశారు.