: హస్తినకు నేడు సీఎం కేసీఆర్... ప్రధానితో భేటీ అయ్యే అవకాశం


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకే ఆయన ఢిల్లీకి వెళుతున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. డిసెంబర్ లో కేసీఆర్ ఆయుత చండీయాగం చేపట్టనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాగానికి రావాలని ఆయన మోదీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. అంతేకాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించేందుకు కూడా కేసీఆర్ యత్నించనున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News