: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తుల క్యూ వెలుపల కూడా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారి భక్తులకు అయితే 10 గంటల సమయం పడుతోంది. కంపార్టు మెంట్లలో మహిళలు, పిల్లలు కొంత ఇబ్బందిపడుతున్నారు. దసరా సెలవులు, ఆపై వారాంతం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగానే ఉంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో తిరుమల నిత్యం రద్దీగా ఉంటుందన్న విషయం తెలిసిందే.