: నితీష్ కే ఓటేయండి ... బీహార్ ప్రజలకు మమతా బెనర్జీ సూచన


ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కే ఓటు వేయాలని మూడో విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్ ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచన చేశారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, నితీష్ లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరమని అన్నారు. ఆయన వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆమె సూచించారు. కాగా, బీహార్ లో మూడో విడత ఎన్నికలు అక్టోబర్ 28న జరగనున్నాయి. నాలుగో విడత నవంబర్ 1న, ఐదో విడత ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 8న వెల్లడవుతాయి.

  • Loading...

More Telugu News