: ఢిల్లీ బస్సుల్లో మహిళల రక్షణకు మార్షల్స్
ఢిల్లీ బస్సుల్లో మహిళల రక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీలోని రవాణా వ్యవస్థ కారణంగా పలు సందర్భాల్లో అత్యాచారాలు జరుగుతున్న వైనం వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళల రక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడిపే బస్సుల్లో మార్షల్స్ ను ఏర్పాటు చేస్తోంది. గతంలో 2 వేల మంది గార్డులను నియమించినా, వారితో భద్రత సరిపోవడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 200 మంది మార్షల్స్ ను నియమించనుంది. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని బస్సుల్లో నియమిస్తారు. వీరందరికీ వాకీ టాకీలు కూడా ఇస్తారు. వీరి ద్వారా మహిళలకు రక్షణ పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.