: కుటుంబ కలహాలతో రౌడీషీటర్ ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా ఒక రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగింది. బెస్తవారిపేట మండలం పాతమార్కాపురం గ్రామానికి చెందిన మేకల కోటేశ్వరరావు (45) నేరాలు, మోసాలు చేసి జీవనం గడిపేవాడు. దీంతో ఇతని పేరు మీద పోలీసులు గతంలో రౌడీషీట్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు కుటుంబంలో గొడవలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే కారణాలేవైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.