: దక్షిణాఫ్రికాతో క్రికెట్ పోరుపై స్పందించిన మోదీ
నేడు ముంబైలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ పోటీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం మన్ కీ బాత్ లో భాగంగా ప్రసంగించిన ఆయన, ఐదు వన్డేల సిరీస్ లో ఇరు జట్లూ చెరో రెండు మ్యాచ్ లు గెలిచినందున, నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్ ఆసక్తిగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. రెండు జట్లకూ తన శుభాకాంక్షలని, ఎవరు గెలిచినా తనకు ఆనందమేనని అన్నారు. గాంధీతో పాటు మండేలా అన్నా తనకు గౌరవమని వెల్లడించిన ఆయన, మ్యాచ్ ఫలితం కోసం అందరు క్రికెట్ అభిమానుల మాదిరిగానే తానూ ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, మరికాసేపట్లో టాస్ పడనుంది.