: జయలలితపై మోదీ పొగడ్తల వర్షం


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఉదయం 'మన్ కీ బాత్'లో భాగంగా ప్రసంగించిన మోదీ, అవయవ దానంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని, అయినప్పటికీ అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లడం లేదని అన్నారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య సేవలు అవయవాల మార్పిడిని సులభం చేశాయని అన్నారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా తమిళనాడు ముందు నిలిచిందని ప్రశంసించారు. కిడ్నీలు, గుండె, కాలేయం తదితరాల మార్పిడిలో తమిళనాట ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి ఎంతో సహాయం అందుతోందని, అవయవాలు సత్వరం చేరేందుకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ముందుకు సాగాలని కోరారు.

  • Loading...

More Telugu News