: టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్! స్వయంగా ఆహ్వానించిన హరీష్ రావు
కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. శనివారం రాత్రి కేశవరావు నివాసంలో జరిగిన ఓ భేటీలో తెలంగాణ మంత్రి హరీష్ రావుతో పాటు వివేక్ కూడా హాజరు కావడం కొత్త చర్చకు తెరలేపింది. వివేక్ ను పార్టీలోకి ఆహ్వానించిన హరీష్ రావు వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగాలని కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు వివేక్ సానుకూలంగా స్పందించినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలను అడిగి వివరాలను తెలుసుకున్నారని సమాచారం. టీఆర్ఎస్ లోకి వివేక్ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.