: తెలంగాణ, ఏపీల్లో అర కోటికి పైగా దొంగ ఓట్లు: భన్వర్ లాల్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 56 లక్షలకు పైగా దొంగ ఓట్లను గుర్తించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 లక్షల దొంగ ఓట్లున్నాయని అన్నారు. త్వరలో వీటన్నింటినీ తొలగిస్తామని తెలిపారు. వీటిల్లో అత్యధికులు రెండు చోట్ల, కొందరు మూడు చోట్ల కూడా ఓటు హక్కును కలిగివున్నారని వివరించారు. జనవరి 11వ తేదీన ఇరు రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించిన ఆయన, నవంబర్ 1 నుంచి 4 లోగా 18 ఏళ్లు నిండి ఓటు హక్కు లేనివారంతా ఓటర్లుగా నమోదు కావాలని సూచించారు. చిరునామాలు మారిన వారు తమ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చని వెల్లడించారు. నవంబర్ 25న ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త గుర్తింపు కార్డులను పంచుతామని అన్నారు.