: అగ్ని ప్రమాదాలు... ముంబైలో 200 దుకాణాలు, విశాఖలో స్టేట్ బ్యాంకు


గత రాత్రి భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. విశాఖపట్నం, ఎంవీపీ డబుల్ రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈకార్నర్ బ్రాంచ్ దగ్ధం కాగా, దాదాపు రూ. 2 కోట్ల విలువైన ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్, బ్యాంకులోని కంప్యూటర్లు, ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. మరోవైపు తెల్లవారుఝామున ముంబైలో పెను ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మార్కెట్ సమీపంలోని ఫుడ్ బజారులో మంటలు చెలరేగాయి. సుమారు 200 దుకాణాలకు నిప్పంటుకుంది. విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందన్న అంశంపై అధికారులు ఇంకా ఓ అంచనాకు రాలేదు.

  • Loading...

More Telugu News